ఆటోనగర్ ఏర్పాటు నిధులు ఇవ్వండి- ఎంఎల్ఏ పార్థసారథి

0
53

విజయవాడ, జూలై 25, 2024: ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందించి, నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషిత్ కిషోర్ గారిని ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు కోరారు. బుధవారం మంగళగిరిలో ఏపీఐఐసీ కార్యాలయంలో ఎం,డి ని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి కలిసి ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఆవశ్యకత గురించి వివరించారు.

ఆదోని పట్టణంలో సుమారు 10 వేల మంది వాహనాలను మరమ్మతులు చేసే కార్మికులు ఉన్నారని వారి తక్షణ అవసరం కోసం ప్రభుత్వం పెద్దపీఠ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని వారి దృష్టిని తీసుకెళ్లారు. గతంలో వాహన మరమ్మతులదారులు ఏపీఐఐసీ కి 33 లక్షలు వీరి వాటాగా కూడా చెల్లించినట్లు గుర్తుచేశారు. ఆటోనగర్ ఏర్పాటు కొరకు పట్టణంలో స్థల సేకరణ చేసి, వారి సంక్షేమానికి పాటుపడాలని కోరారు.