ఇంటింటి కోళ్ళాయి పథకం కింద 77 కోట్లు నిధులు కేటాయించండి- ఎంఎల్ఏ

0
54

విజయవాడ, జూలై, 23, 2024: ఇంటింటి కోళ్ళాయి (జల్జీవన్ మిషన్) పథకం క్రింద ఆదోని అసెంబ్లీ పరిధిలోని గ్రామాల్లో శుద్ధమైన త్రాగునీటి సరఫరా కొరకు 77 కోట్లు నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి గారు కోరారు. మంగళవారం అసెంబ్లీ సెషన్స్ విరామ సమయంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇంటింటి కోళ్ళాయి పథకంకు సంబంధించిన టెండర్లను పిలవాల్సిన నివేదికను సమర్పించారు. ఆదోని అసెంబ్లీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి ఎద్దడి అధికంగా ఉందని గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామీణ పాత్రలో ఇంటింటి కోళ్ళాయి పథకాన్ని అమలు చేయలేక పోయారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదోని మండల పరిధిలోని సుమారు 25 గ్రామాల్లో ఇంటింటి కోళ్ళాయి పథకం ప్రారంభానికి నోచుకోలేదని, ఆ గ్రామాల్లో నీటి సరఫరా కోసం రూ 77 కోట్ల రూపాయల అంచనాలను గత అధికారులు తయారు చేసినప్పటికి అప్పటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు నీటిని అందించలేకపోయారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నీళ్లు అందించేందుకు కృషి చేయాలన్ని కోరారు.

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గల గ్రామీణ రోడ్ల ఏర్పాటు, మరమ్మతులకు రూ 13 కోట్లు మంజూరు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారధి గారు కోరారు. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం విరామ సమయంలో మంత్రి గారిని కలిసి ఆదోని మండల పరిధిలోని గ్రామ పంచాయతీ రోడ్ల ఏర్పాటుకు సంబంధించిన సమర్పించి రోడ్ల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. మంత్రి పవన్ కళ్యాణ్ అందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

వాటితో పాటు మండలంలో నీటి సరఫరా కొరకు 250 బోర్ వెల్స్ వేయించుట గురించి కూడా ప్రస్తావించారు. అలాగే మండల పరిధిలోని బసాపురం గ్రామంలో ఉన్న జగనన్న కాలనీలో ss ట్యాంక్ నిర్మాణం కొరకు రూ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.