తక్షణ అవసరాల కొరకు రూ 1 కోటి 24 లక్షలు మంజూరు.

0
114

విజయవాడ, జూలై 26, 2024: శుక్రవారం పురపాలక శాఖ మంత్రి నారాయణ గారిని కలసి ఆదోని పురపాలక సంఘం పరిధిలోని విస్తారణ ప్రాంతాల అబివృద్దికి సంబంధించి రూ 44 కోట్లు నిధులు అవసరమని కోరారు. పట్టణంలోని విస్తరణ ఏరియాలలో ప్రజలకు కనీసం అవసరాలైన మురుగు కాలువలు, రోడ్లు, పైపులైన్లు సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారి సౌకర్యార్థము ప్రత్యేక నిధులను మంజూరు చేయించాల్సిందిగా మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి తక్షణ అవసరాల కోసం కోటి 24 లక్షలను మంజూరు చేసినట్టు తెలిపారు.